Header Banner

తిరుమలలో యాంటీ డ్రోన్ సిస్టం...! డ్రోన్ ఎగరేస్తే ఇక అంతే!

  Fri May 30, 2025 09:00        Others

మూడంచెల భద్రత నడుమ తిరుమల మొత్తం నిఘా నీడలో ఉంటుంది. టీటీడీ విజిలెన్స్, ఎస్పీఎఫ్, స్టేట్ పోలీస్, అక్టోపస్ అంటూ పలు విభాగాలు తిరుమలలో పహారా కాస్తున్నాయి. ప్రత్యేకంగా తిరుమలలో 2 వేల సీసీ కెమెరాలతో నిత్యం పర్యవేక్షిస్తూ... ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ముందస్తుగా పసిగట్టే అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది. శ్రీవారి ఆలయంతో పాటుగా ఆలయ పరిసర ప్రాంతాలు, తిరుమలలో వివిధ సముదాయాల వద్ద హై డెఫినిషన్ దృశ్యాలు చిత్రీకరించే నిఘా కెమెరాలను అమర్చింది టీటీడీ. లోతుగా జూమ్ చేసిన వీడియోలు కూడా స్పష్టంగా కనిపించే కెమెరాలను అమర్చారు.
తిరుమలలో చీమ చిటుక్కుమన్నా తెలిసేలా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో గతంలో ఎలాంటి సమాచారం అయినా టీటీడీ నిఘా విభాగం, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సెకన్లలో సమాచారం విజిలెన్స్ విభాగానికి చేరుకొనేది. పిట్ పాకెటింగ్, దొంగతనాలు, మిస్సింగ్ ఇలా అనేక ఘటనలను సులభంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గుర్తించి నిమిషాల వ్యవధిలో పోగొట్టుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేలా నిఘా వ్యవస్థ క్రియాశీలక పాత్ర పోషించేది.

ఇది కూడా చదవండి: రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

ఆలస్యంగా ఓటీటీ ట్రాక్ పైకి.. ఫారిన్ కష్టాలు పడితేనే గాని తెలియదు..!


ఏపీ మద్యం కేసులో నలుగురు నిందితులకు కస్టడీ! న్యాయవాది సమక్షంలో..


బెయిల్.. అయినా తప్పదు జైలు అన్నట్టుగా వల్లభనేని వంశీ పరిస్థితి! కీలక ఆదేశాలు జారీ.!


చిక్కుల్లో క‌మ‌ల్ హాస‌న్‌.. బెంగళూరులో కేసు న‌మోదు! ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై కన్నడిగుల‌ ఆగ్రహం..


ఈ సంప్రదాయం కళాకారులకు గొప్ప.. సీఎంకి కృతజ్ఞతలు తెలిపిన చిరంజీవి!


కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!  


ఉద్యోగులకు గుడ్ న్యూస్! భారీగా పెరగనున్న జీతాలు! ఎంతంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #Tirumala #AntiDroneSystem #DroneBan #TTD #TempleSecurity #DroneAlert #TirumalaNews